వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తమ్మయ్య బాబు

ప్రత్తిపాడు నియోజకవర్గం: ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామానికి చెందిన తోటకూర వీరబాబు తండ్రి తోటకూర విష్ణు స్వర్గస్తులయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.