నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టుని ఖండించిన తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు, విశాఖపట్టణంలో జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్ట్ ను రాష్ట్రకార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఒక అధికారపార్టీ ఎంపీ నిర్వాకాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వెళుతున్న మనోహర్ ని మరియు స్థానిక నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. తమ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాస్తుదోషం అని రోడ్డు మూయించడం ఎంతవరకు న్యాయమని, ఈ రాష్ట్రనికి అసలైన వాస్తుదోషం వైసీపీ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు ఈ దోషాన్ని వదిలించుకోడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. బేషరతుగా మానాయకులని వెంటనే విడుదల చెయ్యాలని లేదంటే చలో వైజాగ్ పిలుపునిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వరికూటి నాగరాజా, దాసరి వీరేంద్ర, కొక్కంటి మహేష్, రాగిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.