టిడిపి అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ప్రచారం

కోనసీమ జిల్లా: అమలాపురం నియోజకవర్గం, అమలాపురం రూరల్ మండలం, బండారులంక గ్రామంలో ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం మండల అధ్యక్షులు మల్లుల పోలయ్య ఆధ్వర్యంలో చింత శంకరమూర్తి, పిచ్చుక శ్యామ్ అధ్యక్షతన అమలాపురం మాజీ శాసన సభ్యులు మరియు నియోజకవర్గం ఇంచార్జ్ అమలాపురం నియోజకవర్గం తెలుగు దేశం- జనసేన -బి.జె.పి. పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు ఎన్నికల ప్రచారం ప్రారంబించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటు వేసి ఎమ్ ఎల్ ఏ, ఎంపీ అభ్యర్థులను గెలిపిచాలి అని ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబు ని ముఖ్య మంత్రి చేయాలి అని, చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమములో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.