హిందూపురంలో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం

హిందూపూర్: తెలుగుదేశం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అదేశాలమేరకు హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన సమన్వయ సమావేశం హిందూపురం పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. రెండు పార్టీలు ఐక్య కార్యాచరణతో కలిసికట్టుగా ముందుకెళ్లి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, జనసేన పార్టీ తరపున గొల్లపురం నారాయణస్వామి నవీన్ వై బాబు పాల్గొనడం జరిగింది.