పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి రైతు బజార్ తక్షణమే ఏర్పాటు చేయాలి!!

  • పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి మంజూరు అయిన రైతు బజార్ తక్షణమే ఏర్పాటు చేయాలి!!

పలాస నియోజకవర్గం: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సెక్రటరీకి గురువారం జనసేన పార్టీ నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. చిన్న కార మధ్య తరగతి రైతులు పండించే పంటలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు దళారిలు లేకుండా డైరెక్టుగా అమ్ముకునే సౌలభ్యం ఇచ్చేది రైతు బజార్ అని ప్రస్తుతం ఆ పరిస్థితి లేక అదంతా మధ్యవర్తిల మయం అవుతుండటం రైతులకి బాధని మిగులుచుతుందని కొనుగోలుదారులకు కూడా ధర స్థిరత్వం లేక పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అని గతంలో టమోటా కొరత ఉండే సమయంలో రెండు వందల రూపాయలు చేరితే సామాన్యులు కొనుకోలేని పరిస్థితి ఏర్పడినది. ఆ సమయంలో రైతు బజార్ ఉంటే ఉపయోగపడేది అని పలాస ప్రజలు అందరూ భావించారని ప్రస్తుతం కార్తీక మాసాన్ని అనువుగా తీసుకుని వున్నా కూరగాయల్ని ఇష్టంసారా ధారాలని అమ్ముతున్నారని పలాసకి సమీప ప్రాంతంలో అటు సోంపేట ఇటు టెక్కలిలో కన్నా పలాసలో వున్నా కూరగాయల ధరలకు చాలా వ్యత్యాసం వుందని, అందుకు కారణం ప్రస్తుత కూరగాయలు వ్యాపారం సిండికేటేగ మరి అధిక ధరలకు అమ్మకం చేస్తున్నారని, ప్రస్తుతం ఉల్లి ధర కూడా వంద రూపాయలు పలుకుతుంది గతంలో మంజూరు అయ్యి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ ఎందుకు మధ్యంతరంగా ఆపుదలచేసారో అర్ధం కావటం లేదు అని, తక్షణమే పలాస కి మంజూరు అయిన రైతు బజార్ ఏదో ఒక చోట ప్రారంభించాలి అని, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల తరుపున జనసేన పార్టీ నాయకులు ఎ.ఎం.సి సెక్రటరీ వారికి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్, రిటైర్డ్ ఎస్.ఐ కొన కృష్ణ రావు, జనసేన జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు సందీప్, గిరిబాబు, కిరణ్ తదితరులు వున్నారు.