పొన్నూరు నియోజకవర్గంలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం

పొన్నూరు నియోజకవర్గం: శంసాం ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గాదె మాట్లాడుతూ: జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయాలు తీసుకున్న వాటిని తూచా తప్పకుండా కింద స్థాయిలో అందరం పాటించాలని ఏమైనా చిన్నచిన్న పొరపాటులు వస్తే వాటిని మనమే సరిచేసుకొని సర్దుకొని పోవాలని రేపు జరగబోయే ఎలక్షన్లలో మనము తప్పకుండా విజయం సాధిస్తాం అధికారాన్ని దక్కించుకుంటామని తెలిపారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ: జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి గాదె వెంకటేశ్వరరావుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వారు చెప్పిన విధంగా రాష్ట్ర నాయకత్వం ఏ విధమైన నిర్ణయాలు కార్యక్రమాలు తీసుకుంటారో అదే విధంగా కిందిస్థాయిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా కలిసి ముందుకు వెళతామని తెలిపారు.