మినీ ఫిషింగ్ హార్బర్లో టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు నియోజకవర్గం, అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి మత్స్యకార సోదరులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. గాజు గ్లాసులో టీ అందరికి ఇచ్చి సుదీర్ఘకాలం వారితో మాట్లాడి,

  • హార్బర్లో మంచినీటి సదుపాయం లేదని
  • కరెంటు సౌకర్యం లేదని
  • వలలు కుట్టు పనికి షెల్టర్ లేదు
  • దూర ప్రాంతాలనుండి వేటకు వచ్చే వారికి మౌళిక సదుపాయాలు లేవని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
    ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుంది అని, రాబోయే జనసేన- టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం దృష్టికి హార్బర్ లోని సమస్యలను తెలిపి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రావూరి నాగు, యెనుముల వెంకటపతి రాజా, అల్లూరి రంగరాజు, కొణతం నరసింహారావు, ఎంపిటిసి ఉండపల్లి అంజి, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, పల్లిపాలెం గ్రామశాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మల్కిపురం ఎంపిటిసి జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, బట్టేలంక ఎంపిటిసి ఆవుపాటి శివజ్యోతి సుబ్రహ్మణ్యం, సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, మల్కిపురం మండలం ప్రధాన కార్యదర్శి నల్లి ప్రసాద్, గొంది గ్రామశాఖ అధ్యక్షులి కొల్లు వెంకట రాజు, జనసేన నాయకులు పల్లిపాలెం జనసేన గ్రామ కార్యవర్గం జనసైనికులు, కరవాక గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.