భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు తేజస్‌ ఫైటర్‌ జెట్లు..

భద్రతా వ్యవహారాలపై కేంద్ర కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అధునాత తేలికపాటి యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ ఫైటర్‌ జెట్‌లు కొనుగోలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. భారత వైమానికి దళాన్ని బలోపేతం చేసేందుకే తేజస్‌ ఫైటర్‌ జెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది.

అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హెలికాప్టర్లు, ఎస్‌సీఐ తేజస్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లను రక్షణ శాఖ అందజేయనుంది. బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ కమిటీ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా, భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతోంది. దేశ రక్షణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది కేంద్రం. ఇప్పటికే యుద్ధ విమానాలు, తదితర రక్షణ శాఖకు చెందిన పరికరాలు సమకూర్చింది. రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.