కేంద్ర మంత్రి గడ్కరీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజధాని న్యూఢిల్లీలో గత కొద్ది రోజుల నుంచి తీరిక లేకుండా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నేడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు గడ్కరీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ భూసేకరణ, నిధుల అంశాలకు సంబంధించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆ రోజు నుండి ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నెల 3వ తేదీ నుండి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షాతో భేటీ అయ్యారు. అలాగే, ఈ రోజు రాత్రి కేంద్ర మంత్రి షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారు