తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ చట్ట సవరణ చేయనుంది. దీన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ చట్ట సవరణను నిరసిస్తూ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చింది. అలాగే బీజేపీ మరొక డిమాండ్ చేస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ రెండు డిమాండ్లపై బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారంతా అసెంబ్లీ వద్దకు దూసుకురావడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తమ నేతలను అరెస్టు చేయడం పట్ల బీజేపీ తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనాయకులను ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను రాష్ట్ర కార్యాలయంలో నిర్బంధించారు.