ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నియోజకవర్గంలో తనకోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం కృతజ్ఞతా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తో పాటు సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, వివిధ డివిజన్లు నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.