అందుకే కరోనాను జయించాను: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తాజగా కరొనా నుండి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరోగ్య సమస్యలు, ఎక్కువ  వయస్సు ఉన్నప్పటికీ కరోనా నుంచి ఆయన ఏవిధంగా కోలుకున్నారో తెలియజేసారు. శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, మంచి ఆహారం తీసుకోవటంతోనే ఈ సమస్యను అధిగమించానని చెప్పుకొచ్చారు. రోజూ క్రమం తప్పకుండా యోగా, నడవటంతోపాటు సంప్రదాయ ఆహారం తీసుకోవటం వల్ల కరోనాని అధిగమించానని ఉపరాష్ట్రపతి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు రోజు శారీరక వ్యాయామాలు చేయాలని… నడవటం, యోగా చేయటం, ప్రోటీన్‌ ఆహారం తీసుకోవాలని… జంక్‌ ఫుండ్‌ని తీసుకోకూడదన్నారు.

ప్రతి ఒక్కరు తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, మాస్కులు ధరించటం, సామాజిక దూరాన్ని పాటించటం లాంటి విషయాల్ని మానకూడదని నొక్కి చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు కొవిడ్‌ మహమ్మారికి సంబంధించి వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆర్టికల్స్‌ చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించానని వెంకయ్య నాయుడు చెప్పారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం మంచి వ్యూహాం అమలు చేస్తోందని ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని వెంకయ్య అన్నారు. కరోనా జయించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఉపరాష్ర్టపతి కృతజ్ఞత తెలిపారు. కరోనా సోకిన 136 మంది రాజ్యసభ సెక్రటేరియట్ ఉద్యోగులు కోలుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.