అత్యంత నియమనిష్టలతో 4వ రోజు రాజశ్యామల యాగం

సత్తెనపల్లి, అత్యంత నియమనిష్టలతో రాజశ్యామల యాగం నాలుగు రోజులు పూర్తి చేసామని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు తెలిపారు. ఈ యాగంను అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో కపోతేశ్వర స్వామి దేవస్థానం నందు చేస్తున్నామన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల నుండి కూడా జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకొని దేవుని ఆశీస్సులు పొందుతున్నారు. గురువారం ఉదయం నుంచి గోపూఅజ, గురు ప్రార్ధన, మండప పూజలు, చండి పారాయణం, రాజ్యశ్యామల జపం, రుద్రాభిషేకం రాజ్యశ్యామాల హోమం, చండి హోమం, హరితి, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి జరిగిందన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికార మార్పిడి జరిగిందని, అప్పుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న మా ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. శ్రీశతకుండాత్మక మహారుద్ర, శతసహస్ర మహాచండీసహిత, శ్రీరాజశ్యామల యాగం అత్యంత శక్తివంతమైందని, చాలా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకంతోనే చేపట్టామన్నారు. ఈ యాగంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం 9వ రోజు చివరి రోజు కావున అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీగా యాగం జరుగుతుందన్నారు. తరువాత భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని బొర్రా తెలిపారు. చివరి రోజు రాజశ్యామల యాగంలో పాల్గొనేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారన్నారు.