నిందితుడిని కఠినంగా శిక్షించి బధితుందికి న్యాయం చేయాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అఘాయిత్యానికి పాల్పడిన హాఫిజ్ మస్తాన్ ను కఠినంగా శిక్షించాలని, ఒక పసిపాపపై జరిగిన అఘాయిత్యంపై ఇంతవరకు వైయస్సార్సీపి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గానీ కలెక్టర్ ఢిల్లీ రావు గాని మరి ఏ ఇతర అధికారి గానీ కనీసం స్పందించలేదని, బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అండగా నిలబడి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ మరియు నాయకులు సయ్యద్ మోబినా, పొట్నూరి శ్రీనివాసరావు, బొట్ట సాయి, బావిశెట్టి శ్రీనివాసరావు, బంగారు నూకరాజు, నోచర్ల పవన్ కళ్యాణ్.
విషయం : విజయవాడ పాత రాజరాజేశ్వరి పేట ఉర్దూ స్కూల్ బజార్ డోర్ నెంబర్ 19-11-5, నందు నివాసం ఉంటున్న షేక్ చాంద్ బాషా కుమార్తె , అత్యాచారానికి గురైన ఆరేళ్ల బాలికకు న్యాయం చేయాలి, మానవ మృగం హాఫిజ్ మస్తాన్ ను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ. విజవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన షేక్ చాంద్ బాషా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిది చాలా పేద కుటుంబం చాంద్ బాషా భార్య ఇళ్ల యందు పనిచేసుకొని ఇరువురి సంపాదనతో పిల్లల్ని ఉర్దూ స్కూల్లో చదివించుకుంటూ చాలా పేదరికంలో జీవితం గడుపుతున్నారు. వీరి రెండవ పాప స్థానిక ఉర్దూ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నది. స్థానికంగా నివాసముంటున్న మానవ మృగం షేక్ హఫీజ్ మస్తాన్ తన కామ వాంఛను తీర్చుకునేందుకు పసిపిల్లలైనటువంటి ఆరేళ్ల పాపపై కన్నేసి మాయమాటలు చెప్పి బొమ్మలు కొనిస్తానని గదిలోకి తీసుకువెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అభం శుభం తెలియని ఈ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినాడు. ఈ ఘటన యావత్ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది, ఇంత పెద్ద సంఘటన జరిగినా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు కలెక్టర్ స్పందించలేదు చిన్నచిన్న పనులు చేసుకుంటూ తమ ఆడ పిల్లల్ని పోషించుకునే వారంటే ప్రభుత్వానికి అధికారులకి ఇంత చిన్న చూపా అని మా హృదయాలని కలచివేస్తుంది. పదే పదే ప్రభుత్వము దిశా చట్టం చేశామని చెప్తున్నా రాష్ట్రంలో మహిళలపై దాడులు అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతునేన్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున ఆరు సంవత్సరాల పసిపాపపై ఇలాంటి దుర్ఘటన జరిగితే స్పందించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధికి లేదా? రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కూడా స్పందించలేదు. స్పందించలేక పోవడానికి గల కారణం బాధ్యత రాహిత్యమా లేక పేద ఇంటి ఆడపిల్లలంటే చులకన భావమా మానవ మృగాన్ని కఠినంగా శిక్షిస్తామని బాధితు కుటుంబానికి అండగా నిలబడతామని స్థానిక ప్రజాప్రతినిధి గాని ప్రభుత్వం గానీ స్పందించలేదంటే పేద కుటుంబాల ఆడ పిల్లల రక్షణ మరియు గౌరవమర్యాదల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వనికి లేదనే నిర్లక్ష్య ధోరణి రాష్ట్రంలోని మహిళలందరికీ అర్థమవుతుంది. తమరు తక్షణమే స్పందించి మానవ మృగం హాఫిజ్ మస్తాన్ ను కఠినంగా శిక్షించేలాగా తగు చర్యలు తీసుకొని బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించగలరని తెలిపారు.