పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యం

  • అధికార మార్పుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
  • జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లండి
  • ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండండి
  • జనసైనికులు, వీరమహిళలతో జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న రాక్షస పాలనకు అంతం పలికి, నిజాయితీ, నిబద్ధత, సమర్ధత ఉన్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ప్రతీఒక్కరూ శక్తికి మించి కృషి చేయాల్సిన అవసరముందని జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో నగర కమిటీతో పాటూ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా వ్యవస్థలన్నింటినీ వైసీపీ నేతలు తమ దాష్టీకాలతో నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగాల్సిన సమయం ఆసన్నమైందని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ ఇదే వైసీపీ పాలన కొనసాగితే రాష్ట్రంలో ఎవరూ బతకరని, ఇతర ప్రాంతాలకు వలసెల్లిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్దాంతాలను, పార్టీ షణ్ముఖ వ్యూహాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు. ప్రతీక్షణం ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుక రాజు, ప్రధాన కార్యదర్సులు సూరిశెట్టి ఉదయ్, యడ్ల నాగమల్లేశ్వరరావు, ఆనంద్ సాగర్, కమిటీ సభ్యులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.