సింగరాయకొండ గ్రామపంచాయతీలో జరిగిన భారీ అవినీతిపై ఆధారాలతో సహా బట్టబయలు చేసిన జనసేన

కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీలో కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందని జనసేన పార్టీ సుమారు సంవత్సరం కాలంగా స్పందనలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఒంగోలు డి.ఎల్.పి.ఓ పద్మ ని నియమించడం జరిగినది. విచారణ చేపట్టిన డి.ఎల్.పి.ఓ పద్మ ఇచ్చిన నివేదికలో సింగరాయకొండ గ్రామపంచాయతీలో ఎటువంటి పనులు చేయకుండా నిధులు దుర్యోగం అయ్యాయని సుమారు 33 లక్షల రూపాయలు సర్పంచి ఎకౌంటుకి బదిలీ చేయడమైనది నివేదిక ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ప్రత్యేక అధికారిని నియమించవలసి ఉన్నప్పటికీ సేమ్ క్యాడర్ కి చెందిన కనిగిరి డీ.ఎల్.పి.ఓ జి శోభన్ బాబుని విచారణ అధికారిగా నియమించడం జరిగినది. విచారణ చేపట్టిన కనిగిరి డిఎల్పిఓ జి.శోభన్ బాబు (ఎఫ్ఎసి) ఫిర్యాదారుల్ని పిలవకుండా విచారణ చేపట్టి వైసిపి ప్రభుత్వ ప్రలోభాలకు లొంగి పూర్తి స్థాయిలో జరిగిన అవినీతిని ఆధారాలతో ఇవ్వకుండా కొంతవరకు మాత్రమే సుమారు 14 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకుండా, కొనుగోలు చేసినట్టుగా దొంగ బిల్లులు సృష్టించి ఆ నగదును సర్పంచి తాటిపర్తి వనజ ఎకౌంట్ కి బదిలీ చేయడమైనది అని నివేదిక ఇవ్వడం జరిగినది. గతంలో జనసేన పార్టీ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి సింగరాయకొండ గ్రామపంచాయతీలో సర్పంచ్ తాడిపత్రి వనజ సొంత అకౌంట్ కు భారీ మొత్తంలో నిధులు దారి మళ్ళించడమైనదని డ్రాయింగ్ పవర్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు సర్పంచ్ తాటిపర్తి వనజ చెక్ పవర్ రద్దు చేయమని సాక్షాదారాలతో నివేదిక ఇవ్వడం జరిగినది. అయినప్పటికీ ఒంగోలు డిపిఓ నారాయణరెడ్డి కనిగిరి డిఎల్పిఓ ఇచ్చిన నివేదికను తారుమారు చేసి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని అంశాలను పొందపరచి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ (మెజిస్ట్రేట్) హోదాలో ఉన్నటువంటి అధికారులు సైతం మోసం చేయాలని దురుద్దేశంతో అవినీతి చేసిన సర్పంచ్ తాటిపర్తి వనజని కాపాడాలని దొంగ రిపోర్టు తయారుచేసి ఆర్టిఏ యాక్ట్ ద్వారా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగినది. సదరు విచారణ జరిపిన శోభన్ బాబుని అవినీతి జగినదా లేదా అని పొందపరచి ఉండవలసి ఉండగా తమరి నివేదికలో రాజకీయ కోణంలో అంశాలను నివేదికలో ఎందుకు పొందు పరిచారు అని వివరణ అడుగగా నేను ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను నేను పొంద పరచలేదు అని నేను ఇచ్చిన ఇది అని జనసేన పార్టీకి ఇవ్వడం జరిగినది. సింగరాయకొండ గ్రామ పంచాయతీలో ఎటువంటి వస్తువులు మేము కొనలేదు అని ఈవో పీఆర్డి అంజలి దేవి మరియు పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వటం జరిగినది. సింగరాయకొండ గ్రామపంచాయతీలో భారీ మొత్తంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు జనరల్ ఫండ్ నిధులు కూడా వారి బినామీ అకౌంట్ లోకి మార్చుకోవడం జరిగింది అని గతంలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వీరిపై క్రిమినల్ చర్యలు చేపట్టకుండా వీరిని కాపాడాలని దురుఉద్దేశంతో డిపిఓ నారాయణరెడ్డి ఉన్నాడని జనసేన పార్టీ ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. సింగరాయకొండ గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ సహాయకురాలు టీ శైలజ రికార్డులు పోషించుటలో విఫలమైనదని ఒంగోలు డి.ఎల్.పి.ఓ ఇచ్చిన నివేదికలో ఉన్నది. అయితే నిధులు దుర్వినియోగ అవటానికి పంచాయతీకి గుమస్తాకి ఎటువంటి సంబంధం లేదనిపై అధికారులు గమనించకుండా గ్రామ పంచాయతీలో డ్రాయింగ్ పవర్ సెక్రెటరీకి సర్పంచ్ కి అధికారం కలది అని గ్రహించినప్పటికీ అవినీతిలో ఎటువంటి సంబంధం లేని జూనియర్ అసిస్టెంట్ సహాయకురాలపై అవినీతిని నెట్టి అవినీతి చేసిన సింగరాయకొండ సెక్రటరీ మరియు సర్పంచ్ నీ కాపాడాలని దురుద్దేశంతో స్పెషల్ అధికారిగా వ్యవహరించినటువంటి ఎంపీడీవో షేక్ జమీవుల్లా ఆఫీస్ ఆర్డర్ పేరుతో నగదుకు ఎటువంటి సంబంధం లేకుండా మరియు రామ్మోహన్రావు సెక్రటరీగా ఉన్న కాలంలో మరియు ఏ.శరత్ బాబు స్పెషల్ నోటీసు జారీ చేయడం కూడా జరిగినది. సింగరాయకొండ గ్రామపంచాయతీలో భారీగా అవినీతి జరగడంలో కీలకపాత్ర పోషించినటువంటి ఎంపీడీవో షేక్ జమీవుల్లా వారి బినామీల అకౌంట్ లకు నగదు దారి మల్లించటం జరిగింది అని ఈ అవినీతికి పూర్తిగా ఈవోపీఆర్డి అంజలీదేవి భాగస్వాములు అయి ఉన్నారని ఆధారాలతో జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది. కనుక సింగరాయకొండ గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి డ్రాయింగ్ పవర్ కలిగినటువంటి సెక్రటరీ మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్ రద్దుపరిచి సింగరాయకొండ గ్రామ ప్రజల సంపదను తిరిగి పంచాయతీకి వచ్చే విధంగా చర్యలు చేపట్టి ఈ అవినీతి అధికారులైనా డిపిఓ నారాయణరెడ్డి, సర్పంచ్ తాటిపర్తి వనజ, ఎంపీడీవో షేక్ జమీవుల్ల, ఈఓఆర్డి అంజలీదేవి, స్పెషల్ అధికారిగా కనిగిరి డి.ఎల్.పి.ఓ జి శోభన్ బాబు, గ్రామపంచాయతీ సెక్రటరీ ఏ.శరత్ బాబుల పై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టనట్ల అయితే జనసేన పార్టీ నుండి కోర్టుని ఆశ్రయించవలసి వస్తుందని మీడియా ద్వరా తెలియజేయడం అయినది. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనపర్తి మనోజ్, జరుగుమల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గూడ శశిభూషణ్, సింగరాయకొండ మండల నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగినది.