జనసేన బలోపేతమే లక్ష్యం

పుట్టపర్తి టౌన్: వైకాపా అరాచకాలు ఎండగడుతూ గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేస్తామని జనసేన జిల్లా నాయకులు పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తిలో నియోజవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరు మండలాల జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చురుకైన నాయకత్వంతో మండల కమిటీలు త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు వరుణ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలు సమీక్ష చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. జనసేన కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, నాగేంద్ర, అబ్దుల్, ధనుంజయ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.