ఆర్కాట్ రాకతో అరణిలో ప్రభంజనం

  • జనసేన కండువా కప్పుకున్న ఆర్కాట్ కృష్ణప్రసాద్

తిరుపతి: బలిజసేన వ్యవస్థాపకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ జనసేన పార్టీలో చేరడంతో తిరుపతి ఉమ్మడి బిజెపి, టిడిపి, జనసేనల పొత్తు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు ఓ ప్రభంజనం లా మారింది. మాజీ ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు బలిజ సేన ప్రధాన నేతలైన ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్ తదితరులను శాలువా కప్పి జనసేన పార్టీలోకి జనసేన నేతలైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆకేపాటి సుభాషిని తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది ఆర్కాట్ అనుచరులకు జనసేన కండువా కప్పించారు. గాజు గ్లాసు గుర్తును నియోజకవర్గంలో ప్రజలందరికీ గుర్తుండేలా జనసేన పార్టీ గెలుపుకు సహకరించేలా.. బలిజసేన పనిచేస్తుందని ఆర్కాట్ ఈ సందర్భంగా అరణి గారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, నగర ఉపాధ్యక్షురాలు మలిశెట్టి లక్ష్మి, జనసేనలో చేరిన నాయకులు రాఘవ రెడ్డి, విక్రమన్, సాయి కుమార్, వినయ్, మస్తానయ్య, గోపినాథ్, బాసికర్ల రఘు, వంశి, సుమతి, శ్వేతా, శాంతి తదితరులు పాల్గొన్నారు.