దేశం గర్విస్తోంది

మేడిన్ ఇండియా కోవిడ్ టీకాలను తీసుకురావడం లో భారత శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని,  రెండు స్వదేశీ  వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న చాలాదేశాలు భారత్‌ తయారు చేసిన టీకా కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. భారత పరిశోధనపై విమర్శలకు టీకా అభివృద్ధితో మన శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారని అన్నారు. దూరదృష్టితో పరిశోధన సంస్థలకు ఊతం ఇచ్చి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపడంతోనే వ్యాక్సిన్‌ తయారీ సాధ్యమైందని మోడీ పేర్కొన్నారు.