తెగిన విద్యుత్ తీగ తగిలి పొందూరు జనసేన నాయకుడు మరణం దారుణం

ఆమదాలవలస: విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో విద్యుత్ తీగ తగిలి ఆదివారం ఉదయం పొందూరు మండల జనసేన నాయకుడు గొర్లే వసంత కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. తన ప్రజా సేవే తనను కాటేసింది. విద్యుత్ తీగలు తెగిపోయే ప్రమాదం ఉంది అని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో, వీడియో తీసి కంప్లైంట్ చేద్దాం అని వీడియో తీస్తుండగా అదే తీగ తగిలి చనిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయం తెలుసుకున్న నియోజక వర్గ ఇంచార్జి పేడాడ రామోహన్ రావు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని, తమ్ముడులా భావించే వసంత్ కుమార్ మృత దేహాన్ని చూసి పేడాడ భావోద్వగానికి గురయ్యారు. ఈ విషయములో నిర్లక్ష్యం చేసిన ఏ.ఈ మరియు లైన్ మాన్ మీద తీవ్ర కోపాన్ని వ్యక్తం చేశారు. లైన్ మాన్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామమోహన్ రావు సంఘటనా స్థలానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోటి జనసైనికుడు మరణ వార్త విని భారీగా జనసైనికులు మరియు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.