మనకు అందే తొలి కరోనా వ్యాక్సిన్ ‘ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్’

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే అందరికీ అన్నింటా ఆశక్తి నెలకొంది. ప్రపంచంలో చాలా కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో ఉన్నాయి. రష్యా ఇప్పటికే రేసులో ముందంజలో ఉన్నానని ప్రకటించుకుంది. ఇక కీలకమైన మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది కేవలం ఐదు కంపెనీలు. ఇందులో ప్రధానంగా విన్పిస్తున్నది ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్, ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ లు. ఈ అన్ని కంపెనీల్లో సత్ఫలితాలనిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భావిస్తూ  అందరూ ఆశలు పెట్టుకున్నది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పైనే.