జనసేన పోరాట ఫలితమే సిధ్ధవటంను కడపజిల్లా లో చేర్చింది.. ఈ విజయం జనసేన విజయం!

జిల్లాల విభజన వల్ల రాజంపేటను కాకుండా రాయచోటి ని జిల్లా చేయడంవల్ల సిధ్ధవటం ప్రజలు చాలా నష్ట పోతారని.. సిధ్ధవటంను కడపలోనే కలపాలని సిధ్ధవటం మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు, సంతకాల సేకరణ చేసి కలెక్టర్ గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జనసేన నాయకుల, కార్యకర్తలు పోరాటాల ఫలితంగా సిధ్ధవటం ను కడపజిల్లా లో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేస్తూ.. ఈ విజయం జనసేన పార్టీ విజయం అని సిధ్ధవటం మండల నాయకులు కొట్టే. వెంకట రాజేష్ మీడియా తో మాట్లాడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సిధ్ధవటం మండల ప్రజలు సంతోషం వ్యక్త పరుస్తూ జనసేన పోరాటాలను అభినందించడం జరిగింది.