క్రీడాకారులకి కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: గాదె

గుంటూరు జిల్లా, దోచుకోవడం దాచుకోవడం అనే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చివరకు క్రీడాకారులను కూడా వదిలిపెట్టడం లేదని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో క్రీడలు నేర్చుకునే క్రీడాకారులకు నెలవారీ చార్జీలు పెంచారు. క్రీడాకారులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడంలేదని క్రీడాకారుల తల్లిదండ్రులు చేస్తున్న నిరసనకు మద్దుతు తెలిపామని అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తుంటే ఎస్.ఏ.ఏ.పి అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవ్వరు కూడా అధిక ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. తల్లిదండ్రులకు క్రీడాకారులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. జగన్ రెడ్డి గద్దెనెక్కాకా అన్ని రంగాలు కుదేలైనవని ముఖ్యంగా క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, నగర అధ్యక్షులు నెరేళ్ల సురేష్ నాయకులు, వీర మహిళలు, క్రీడాకారుల, పేరెంట్స్ అసోసియేషన్ ప్రజలు పాళొన్నారు.