ముక్తుంపురం గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పవన్ అన్న బాట ప్రజలబాట కార్యక్రమంలో 45 రోజులు పాటు విస్తృత ప్రచారంలో ముక్తుంపురం గ్రామ చేరువులో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మావంతు ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు సొసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేనపార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు సోమవారం నాడు ప్రజలను కలిసి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం తప్పిదాలు ప్రజలకు తెలియజేస్తూ అలాగే ఇంతవరకు ఉపాధి కూలీ నగదు ఎకౌంటులో జమ కాలేదు మేము ఎలా బ్రతకగలము ప్రజలు వాపోయారు. గ్రామ ప్రజలకు ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను మరియు మేనిఫెస్టో గురించి చెబుతూ ఈసారి జనసేన పార్టీ వచ్చినట్లు అయితే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ”2500-3500/-వరకు నగదు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించడం జరిగింది. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరడమైనది. ఈ కార్యక్రమంలో ముక్తుంపురం గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.