అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, సీతానగరం మండలం, కోరుకొండ మండల ఎం ఆర్ ఓ ఆఫీస్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ కు మద్దతు తెలిపిన “బత్తుల” గత మూడు రోజుల నుండి అంగన్వాడీలు నిరవధికంగా తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న సమ్మెలో నేడు రాజానగరం జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. శిశు, మాతాశిశు మరణాలను తగ్గించేందుకు, పాఠశాలకు ముందు విద్యను అందించడానికి వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిగణించడం లేదు. వారిపట్ల అలసత్వం చూపుతున్నారు అన్నారు. అంగవాడి టీచర్స్, వర్కర్స్ న్యాయమైన కోర్కెలు తీర్చాలని బత్తుల వెంకటలక్ష్మి డిమాండ్ చేసారు. అంగన్వాడీల కు కనీసం వేతనం అమలు ఆమోద యోగ్యమైనది అనీ తక్షణం అమలుచేయాలి అని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాట్యూటీని అందించాలి. పెన్షన్ వంటి రిటైర్మెంట్ బెనిఫట్స్ అమలుచేయాలి. పెండింగ్ ఉన్న డి ఏ బకాయిలు చెల్లించాలి. మీటింగ్ లకు హాజరు ఐనప్పుడు టి ఏ ఇవ్వాలి. కోవిడ్ సైతం లెక్క చేయకుండా అత్యంత అవసరమైన సేవలు చేసిన అంగన్వాడి ల యొక్క న్యాయమైన కోర్కెలు తిర్చకుండా నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన జగన్ ప్రభుత్వం అనీ నిలదీశారు. జగన్ రెడ్డి నొక్కని బటన్స్ లో మరొక బటన్ అంగన్వాడీల సంక్షేమం. అని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.