చీకటి జి.ఓ లను ప్రభుత్వం వెంటూనే విరమించుకోవాలి – పలాస జనసేన నాయకులు కోన కృష్ణారావు, హరీష్ శ్రీకాంత్

పలాస, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగస్తుల మరియు పెన్షనర్లు వారి యొక్క నెల జీతంతో ముడిపడిన వారి జీవితాలు పై దాడి చేసి రాక్షస ఆనందం పొందుతున్న ఈ ప్రభుత్వం ఆ ముసుగులో ఈ చీకటి జి.ఓ జారీ చేసి వారికి తీరని లోటును కలిపిస్తూ ఆ కుటుంబాలను రోడ్డున పడివేసిన పరిస్థితి ఏర్పడింది అని కనీసం పెన్షనర్ల మీద సైతం కనికరం లేకుండా జారీ చేసిన ఈ చీకటి జి.ఓ తక్షణమే వెనుకకు తీసుకోవాలి అని కోన కృష్ణారావు డిమాండ్ చేసారు. హరీష్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగ రాష్ట్రము మొత్తం ఉద్యోగస్తులు చేస్తున్న దీక్షలకు పూర్తి మద్దాడుతూ తెలుపుతున్నాం అని ఈ యొక్క జి.ఓ ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుని ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు అందరితో చేర్చలు జరిపి అందరికి ఆమోదయోగ్యమైన జి.ఓ ను విడుదల చేయాలి అని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.