అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సోమరౌతు అనురాధ

  • తడిసిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
  • కుంటి సాకులు చెప్పి తప్పించు కోవలని చూస్తే ఊరుకోము
  • రైతులని ఆదుకోవడం లో ఈ వైకాపా ప్రభుత్వమ విఫలం
  • రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిస్తాం
  • జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ

వేమూరు నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు జిల్లా: అకాల వర్షాల వల్ల తడిసిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కుంటి సాకులు చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కలక్టరేట్లనీ ముట్టడిస్తామని జనసేన జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ హెచ్చరించారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రైతులతో పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న జొన్న, మొక్క జొన్న పసుపు పంటలను పరిశీలించి రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమరౌతు అనురాధ రైతులతో మాట్లాడుతూ మెట్ట మాగాణి భూములలో వేసిన రభి వాణిజ్య పంటలను ప్రభుత్వం ఆకరి గింజ వరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్ట పోయిన రైతులని ఆదుకోవాలని అన్నారు. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఇప్పటి వరకు సీఎం, మంత్రులు రైతులను పరామర్శించేందుకు వచ్చిన దాఖలాలు లేవు అన్నారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు గడప గడప కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సర్పంచులు ఓట్లకోసం అభ్యర్థించుకుంటున్నారు. ఊహించని విపత్తులో రైతన్న కుదేలు అవుతున్నాడానీ ఇటువంటి సమయంలో మేము ఉన్నామంటూ బరోసా ఇవ్వవలసిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం అత్యంత హేయం అన్నారు. అసలు రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయని, రైతన్న నరక కూపంలో వున్నడని నాలుగేళ్లుగా తాడేపల్లి పలేస్ కే పరిమితం అయిన ముఖ్యమంత్రికి తెలుసా? అని ఎద్దేవా చేశారు. హత్య కేసులో అవినాష్ రెడ్డినీ కాపాడడంలో వున్న శ్రద్ధ కష్టాలలో వున్న రైతులని ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులని ఇంత వరకు ఎవరు కూడా పలకరించిన పాపాన పోలేదు. రైతుల పట్ల ఈ ప్రభుత్వంకి ఎంత ప్రేమ బాధ్యత వుందో అర్థం అవుతోందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన పంటను పరిశీలించి వెంటనే అన్నదాతను ఆదుకోవాలని, రైతు కంట కన్నీరు సమాజానికి మంచిది కాదని, అన్నదాతను ఆదుకోవడంలో వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.