వారాహి యాత్రకు యూఏఈ జనసేన సంఘీభావం

యూఏఈ: 2018వ సంవత్సరం నుండి యూఏఈ లో యూఏఈ జనసేన చాలామంది జనసేన నాయకులను ఆహ్వానించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2023 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారిని ఆహ్వానించి సంక్రాంతి సంబరాలు అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నాగబాబు గారు వచ్చినప్పుడు నిర్వాహకుల అభ్యర్థుల మేరకు యూఏఈ జనసేన సభ్యులు అందరూ పాల్గొనడం కూడా జరిగింది. ఆగస్ట్ నెలలో మరొక ప్రముఖ జనసేన నాయకుని ఆహ్వానించి ఒక కార్యక్రమం చేయడానికి యూఏఈ జనసేన సంకల్పించుకుంది. జూన్ నెలలో తలపెట్టబోయే, రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించబోయే పవన్ కళ్యాణ్ గారి వారాహి రథయాత్రకు యూఏఈ జనసేన టీం సంఘీభావం ప్రకటిస్తూ ఆదివారం యూఏఈ జనసేన కోర్ టీం సభ్యులందరూ జూమ్ కాల్ ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు ఏ విధంగా నుండి సహాయ సహకారాలు అందించాలో వాటిపై చర్చించడం జరిగింది. ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న కోర్ టీం సభ్యులైన పాపోలు అప్పారావు, అప్పాజీ, శ్రీహరి, చంద్రశేఖర్, రవి వర్మ, ముని కుమార్, సత్య మాలే, అడ్డాల నాని, నాగభూషణం, బాలాజీ, గౌతమ్, సూర్య, అయ్యప్ప, యుగంధర్, ధనంజయ, కిరణ్ కుమార్ తదితర సభ్యులు వారాహి యాత్రకు హర్షం వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులందరూ మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రభంజనం సృష్టించడం ఖాయమని జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి దూసుకెల్లడం ఈ వారాహి యాత్ర వల్ల సాధ్యపడుతుందని, ఈ యాత్రకు ఏ ఈ జనసేన తమ వంతు సహాయంగా లోకల్ టీమ్స్ తో కోఆర్డినేషన్ చేసుకుంటూ తమ వంతు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని యూఏఈ జనసేన సభ్యులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎన్నికల సమయంలో యూఏఈ జనసేన చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.