ఆదివాసీ ప్రజారోగ్య విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి

  • అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య
  • సరస్వతి అంతక్రియలలో పాల్గొన్న జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: గూడెం మండలం, వంచుల పంచాయితీ పరిధిలోగల వి.చెరపల్లి గ్రామంలో బాలింత సరస్వతికి డోలి మోతతో అతికష్టం మీద ఆంబులెన్స్ వరకు తీసుకు రాగలిగారు గ్రామస్తులు. ఆ వీడియో ఫుటేజీ నెట్టింట నియోజకవర్గమంతా వైరల్ అవుతుంది. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె అంతక్రియలకు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య, గూడెం, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మండలాల జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. అసలు వాస్తవ విషయాలు పరిశీలించారు. గంగులయ్య గ్రామస్తులతో ఈ విషయంపై స్పందిస్తూ ఏదైనా సమస్య వలన నష్టాలు జరిగితే ప్రభుత్వ పాలన యంత్రాంగం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది తప్ప ముందస్తు చర్యలు తీసుకోవడంలో, సమస్యల తీవ్రత గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుందనడానికి ఈ సరస్వతి అనే బాలింత ఉదంతమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ప్రతి విషయంపై ప్రభుత్వాన్ని నిందించకూడదు కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని గుర్తించలేనప్పుడు గిరిజనులుగా మనమెలా చైతన్యవంతులు కాగలమో ప్రజలు గుర్తించాలి. ఇక్కడ మాత, శిశు సరంక్షణ శాఖ వైఫల్యముంది ఆ శాఖపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది. ఆ ఫలితాలు గిరిజన ప్రజలు అనుభవించాల్సిందేనా? అన్నారు. నిజానికి సరస్వతి ఒక బాలింత ఆమె ఒక శిశువుకి జన్మనిచ్చి ఆ శిశువుని3 వారాల క్రితమే కోల్పోయి చివరికి తనప్రాణం కూడా కోల్పోయింది. ఇటువంటి మరణాలు నానాటికి జిల్లాలో పెరుగుతూపోతుంది. మారుమూల గ్రామాల ప్రజల్లో ఆరోగ్య చైతన్యం లోపం, మెరుగైన రవాణా సదుపాయం లేకపోవడం అనేక కారణాలు కాబట్టి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేననుకోవాలి. ఆరోగ్యశాఖ, మాతశిశు సంరక్షణ శాఖ, ఇతర అనుబంధ అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్యాధోరణి వీడి ముందస్తుచర్యలు తీసుకుంటే మంచిదన్నారు. నిజానికి గ్రామ క్షేత్రస్థాయిలో ఆశవర్కర్, ఏ.ఎన్.ఎం వుంటారు గ్రామంలో బాలింతలు బాగోగులు చూసుకుంటారు. పౌష్టికాహారం నుంచి ఐరన్, కాల్షియం సమపాళ్లలో ఉంచుతూ వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. గర్భిణీ 9వ నెలలో ఆప్ స్ట్రిక్ స్కాన్ చేసి శిశువు ఎదుగుదల రక్తం శాతం తల్లి ఆరోగ్యం అంతా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తారు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులు, సిబ్బంది అంతంత మాత్రమే ఇటువంటి ఉదంతాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అసలు గ్రామస్థాయిలో సగటు బాలింతల హెల్త్ ప్రొఫైల్ పై ప్రజల్లో అవగాహన లేకపోవడం, చైతన్యం కలిగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం చూస్తుంటే ఆదివాసీ ప్రజారోగ్య విషయంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకోవచ్చు. ప్రసూతి అనంతరం మాత, శిశువు అన్ని రకాలుగా క్షేమమే అనుకుంటేనే డెలివరీ డిశ్చార్జి ఇవ్వాలి. ఇవేమి సక్రమంగా ఇక్కడ జరిగినట్టులేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. గిరిజన ప్రజలు కూడా ఒక వాస్తవిక కోణంతో ఆలోచన చెయ్యాలి రోడ్డు సౌకర్యం లేకపోవడం, ప్రజారోగ్యం విషయంపై అవగాహన లేకపోవడం, ఇంకోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఇలా అయితే ఇంకెలా మాత శిశువు మరణాలు అరికడతారో మరి ప్రభుత్వానికే తెలియాలి. స్థానిక జర్రెల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఎంతవరకు ఆరోగ్య నిపుణులు ఉన్నారో అధికార యంత్రాంగం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అస్తవ్యస్తమైన లోపాలు అనేకం ఉన్నాయి ఇప్పటికైనా గిరిజన ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ కుమార్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మాసడి బీమన్న, చింతపల్లి నాయకులు వంతల రాజారావు, మండల అధ్యక్షులు వంతల బుజ్జి బాబు, స్వామి కిముడు కృష్ణ మూర్తి, జీకే వీధి మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు, మార్క్, సిద్దు, కోటి మధు, ఈశ్వర్, రఘువంశి వరప్రసాద్ పాల్గొన్నారు.