ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతును ప్రభుత్వం ఆదుకోవాలి

  • జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు .

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ మంగళవారం అవనిగడ్డ మండలం పరిధిలోని అశ్వరపాలెం గ్రామానికి చెందిన తక్కిళ్ళ వెంకటపూర్మయ్య అలియాస్ పాపారావు అనే కౌలు రైతు రెండు ఎకరాల సొంత పొలంతో పాటు, మరో 15 ఎకరాల కౌలు చేస్తూ ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటిలో మునిగి పోగా, కొద్దిపొలం కోత కొయ్యగా ఖర్చులు కూడా చేతికి రావని భావించి, ఇప్పటికే ఆ పొలం వేయడానికి మూడు లక్షల రూపాయలు బయట వడ్డీకి అప్పుగా తీసుకురావడం జరిగింది. వర్షాలకు పొలం పాడైపోయినటువంటి విషయం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉదయం పురుగులు మందు సేవించి గిల గిల తన్నుకుంటున్న తరుణంలో, సాటి రైతులు బంధువులు అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో వద్ద వైద్యం కోసం తీసుకురావడం జరిగింది. వైద్యులు వెంటనే చికిత్స చేసి 24 గంటల్లో పరిస్థితి చెపుతాము అనీ తెలియజేయడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో గత వారం రోజులు క్రితం కొత్తపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గ ప్రజలు ఆ విషయం మర్చిపోకముందే మరల ఈరోజు ఈ కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చాలా కన్నీళ్లు తెప్పించే విషయం. ప్రస్తుత ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న నాయకులు, ఈరోజు వరకు ఈ కౌలు రైతు యొక్క పొలం వద్దకు అధికారులు వెళ్లి నష్టపరిహారం లెక్కించి అతనికి మనోధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించకుండా మీనా వేషాలు లెక్కేస్తూ కాలయాపను చేయడం చాలా బాధాకరమైన విషయం. రైతులు, కౌలు రైతులు అప్పులు చేసి పంట చేతికొచ్చే సమయానికి ఇలా తుఫాను రైతులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసుకున్న కౌలు రైతు యొక్క 15 ఎకరాల పొలానికి ఎకరానికి 40000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా అతని కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము. ఆ రైతు కుటుంబ పరిస్థితి గమనిస్తే ఒక ఆడపిల్ల పదో తరగతి గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుకుంటుంది. కుమారుడు నిమ్మకూరులోని ఒక హాస్టల్ లో ఏడవ తరగతి చదువుతున్నాడు. హాస్పిటల్ వద్ద ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విధానం చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. కాబట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతుకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు . ఈ రోజు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ అధ్యక్షుడు రాజనాల వీరబాబు, ఉపాధ్యక్షులు ఆలమల చంద్రబాబు, అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు తడిటర్లు వెళ్లి హాస్పిటల్ వద్ద కౌలు రైతును పరామర్శించారు.