దగా డీఎస్సీ వద్దని జనసేన వినతి

కళ్యాణదుర్గం, ఎన్నికల ముందు రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయులు పోస్టుల ఖాళీగా ఉన్నాయని, వాటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి దగా చేస్తున్నారని ,జనసేన టిడిపి నాయకులు తెలియజేసారు. 13-02-2024 న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి టీ కూడలి వరకు వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాణి సుష్మితకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ & జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ మాట్లాడుతూ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి కేవలం ఇప్పుడు 6100 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి నోటిఫికేషన్ వదలడం పట్ల నిరుద్యోగుల తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, ఐదేళ్ల కాలంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమయం డబ్బులు వృధా అయ్యాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి తక్షణమే 25 వేల ఉపాధ్యాయుల పోస్టులతో డీఎస్సీ విడుదల చేయాలని కోరారు.ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద నిరుద్యోగులకు ఉచిత స్టడీ సర్కిల్స్ తక్షణమే ప్రారంభించాలని ఏపి నిరుద్యోగ జేఏసీ, తెలుగు యువత, జనసేన పార్టీ ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ నిరుద్యోగ సంఘ జేఏసీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ యాదవ్, జనసేన వీర మహిళ షేక్ తార, కళ్యాణదుర్గం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండలం ప్రధాన కార్యదర్శి అనిల్ జనసేన నాయకులు సయ్యద్ మహబూబ్, నీలకంఠ, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు, జనసేన, జేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు.