ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలని జనసేన వినతి

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ల జాబితాలో అనేక తప్పులు పొరపాట్లు ఉన్నాయని వీటన్నిటిని తొలగించి ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా విడుదల చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్ కి ఆధారాలతో సహా పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, సోమీ గోవింద్, బొమ్ము రాంబాబు, దాసిన జై కృష్ణ మరియు సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.