రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ

రాజంపేట: అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటి కలెక్టరేట్ ఎదుట రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధుల పట్ల రద్దయిన పెన్షన్లకు నిరసనగా రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు రద్దయిన పెన్షన్లు శాపమని అన్నమయ్య కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్ష చేపట్టిన జిల్లా వి.హెచ్.పి.స్ అధ్యక్షుడు పూసపాటి రెడ్డయ్య జనసేన పార్టీ తరపున మద్దతు కోరగా సంఘీభావం తెలుపుతూ రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలం అవుతున్నా ముఖ్యమంత్రి అభివృద్ధి పక్కన పెట్టి అవ్వ, తాతలు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్ మీద ఆధారపడి ఉన్న అర్హులకు గుండె కోత మిగిల్చి లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాసమస్యలు మరచి ప్రజాసంక్షేమ అవసరాలకు కాకుండా, అనవసరమైన మాధ్యమాల్లో ప్రభుత్వ ఖజానాని పక్కదోవ మళ్ళించి, వారి వ్యక్తిగత అభివృద్ధి రాజకీయ లబ్ధికోసమే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా ఏదో కారణం చూపి కుట్రతో రద్దు చేసిన పెన్షన్లను వెంటనే పృనరుద్దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాచేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.