ప్రజా సమస్యలపై జనసేన పార్టీ జనగళం

శ్రీకాకుళం నియోజకవర్గం: గార మండలంలో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై జనగళం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రైతుల సాగునీటి సమస్య, ఉపాధి నిర్వద్యోగ సమస్య, తీర ప్రాంత అభివృద్ధి సమస్య, రహదారులు రవాణా నిర్మాణ నిర్లక్ష్యం సమస్య ,గార మండలం అభివృద్ధి లక్ష్యం ఈ సమస్యల మీద జనసేన పార్టీ శ్రీకాకుళం ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు ఒప్పంగిలో జనగళం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మిరెడ్డి శివశంకర్, తూర్పు కాపు జాతీయ సంఘం అధ్యక్షులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిశినిచంద్రమోహన్, మూగి శ్రీనివాస్, శ్రీకాకుళం ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, ఆముదాలవలసి ఇంచార్జ్ పెడడ రామ్మోహన్ రావు, 2019 ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటిఎచెర్ల నాయకులు బాడన వెంకట జనార్దన్ రావు, సీనియర్ నాయకులు భూపతి అర్జున్, కరిమజ్జి మల్లేశ్వర రావు ఈ పాల్గొన్నారు.