వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు

కొండెపి: జూన్ 14వ తేదీ నుండి ఉభయగోదావరి జిల్లాలలో తొలి దశ వారాహి యాత్ర ప్రారంభిస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల, జరుగుమల్లి మండల అధ్యక్షుల ఆదేశాల మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు, స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి, వారాహి యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దుష్ట పరిపాలన నుండి విముక్తి పొంది, నీతివంతమైన పాలన అందించే విధంగా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జరుగుమల్లీ మండల అధ్యక్షులు గూడా శశి భూషణ్, సింగరాయకొండ మండల కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, కిచెంశెట్టి ప్రవీణ్ కుమార్, పోలిశెట్టి విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి, షేక్ సుల్తాన్ భాష, తగరం రాజు, కమిటీ నెంబర్స్ శీలం సాయి, సయ్యద్ సుభాని, బత్తుల వినయ్ కుమార్, మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.