ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా సామాన్యుల భూ హక్కులు హరించబడతాయి

అనంతపురం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 31-10-2023 తారీఖున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా సామాన్య ప్రజల భూ హక్కులు హరించబడతాయి అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ హక్కుల్ని హరించే విధంగా?ప్రత్యామ్నాయ వ్యవస్థను తెచ్చి? న్యాయ వ్యవస్థ గురించి కనీస అవగాహన లేని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది? భూ హక్కుల చట్టాలకు ఇది వ్యతిరేకం, దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి తప్పుడు చట్టాలు తేలేదు. అవసరమైన రాష్ట్రాల్లో భూహక్కు చట్టాలకు సవరణ చేశారు, తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయండి అని న్యాయవాదులు ఉద్యమిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరియు సాక్షాత్తు సీఎస్ జోహార్ రెడ్డి గారి లాంటి కుహనా మేధావులు అందరూ లాయర్లకు ఉపాధి దొరకదని సమ్మె చేస్తున్నారని న్యాయవాదుల పైన నెపం మోపుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే క్రమం జరిగింది. కొంతమంది న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లి ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజల భూహక్కులను పరిరక్షించాలని, ఈ చట్టం ద్వారా భవిష్యత్తు కాలంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని కోర్టుకు విన్నవించగా, కోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ వెయ్యమంటే మేము కేవలం చట్టాన్ని మాత్రమే చేసాం! ఇంప్లిమెంట్ చేయట్లేదు!! అని వైయస్ ప్రభుత్వం కోర్టుకు విన్నవించుకుంది ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఎన్.డి.ఏ కూటమి సభ్యులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టిడిపి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు బిజెపి నాయకులు ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో కలిగే ఇబ్బందుల్ని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తుండగా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది కేంద్రానికి సంబంధించిన చట్టం రాష్ట్రానిది కాదు!! అని సిగ్గు లేకుండా!! పచ్చిఅబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలని నమ్మించే క్రమం చూస్తుంటే, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి వీరు ఏ స్థాయికి అయినా దిగజారిపోతారని అర్థం అవుతా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో సామాన్య ప్రజల భూ హక్కులు పూర్తిగా హరించుకొని పోవడమే కాకుండా ప్రజల ఆస్తులు అన్యాక్రాంతాలకు గురై నానా ఇబ్బందులు పడతారు? కావున రాష్ట్ర ప్రజలారా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి గెలిపించుకొని మీ భూ హక్కులు కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేసారు.