ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

  • ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమెంటి!

తిరుపతి సిటీ: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు గత కొంతకాలంగా తిరుపతి కోర్టు ఆవరణలో చేస్తున్న నిరసనకు మద్దతుగా.. జనసేన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు.. కంచి శ్యామల, శ్రీహరి, విజయభాస్కర్, శరత్ బాబు, భార్గవ్, మోహన్ రావు, ఎల్లమ్మ నాయుడు, లక్ష్మీ కుమార్ హేమ కుమార్ నిరంజన్, దీప శ్రీ, శివ, హరీష్ కుమార్, జై చంద్ర లకు.. జనసేన నాయకులు తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని, లావణ్య, చందన, బాబ్జి, రాజమోహన్, హేమ కుమార్, దినేష్ జైన్, మునస్వామి, వినోద్, కిషోర్, కిరణ్, హిమవంత్, పురుషోత్తం, ఆది, సాయి దేవ్, సురేష్ లు నిరసన దీక్షలో గురువారం పాల్గొని న్యాయవాదులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని, గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని, ఈ చట్టం వల్ల ప్రజలు అష్ట, కష్టాలు పడుతారని, ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమెంటని, తక్షణమే ఈ చట్టం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.