నూతన బాద్యతలు స్వీకరించిన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

నాగర్ కర్నూల్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు బోట్కా రమేష్, సూర్య, రాజు నాయక్, ఎడ్ల శివ బిజినపల్లి మండల నాయకులు రాజశేఖర్, వంశీకృష్ణ, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.