ఆంధ్రని ఆక్రమణలు చేస్తున పక్క రాష్ట్రాలు… ముఖ్యమంత్రి నువెక్కడ?

మదనపల్లె, మనం రాజధాని కోసం కొట్లాడుకుంటుంటే విభజన జరిగి ఏడు సంవత్సరాలు అయినా రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించ కోలేదు పక్క రాష్ట్రాలు తమిళనాడులో కానీ బెంగళూరులో కానీ తమ రాజధానులను విస్తరించుకుంటూ పోతున్నాయి. తాజాగా చెన్నై మహానగరాన్ని ఆంధ్ర బార్డర్ తడ, అటు రాణిపేట వరకు పూర్తి ఆంధ్ర బార్డర్ లోకి వస్తున్న తీరుని చూస్తే ఆంధ్రాలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎంతో తెలివితో ఎంతో ముందు చూపుతో ఆంధ్రాలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయి. లాజికల్ గా మనం ఉపయోగించుకోవాల్సింది ఎలాగంటే చెన్నై గాని బెంగళూరు గాని ఇప్పటికే ఓవర్ లోడ్ అయ్యి కూర్చున్నాయి. ట్రాఫిక్ సమస్య గాని పొల్యూషన్ సమస్య గాని అక్కడ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడం కానీ కష్టతరంగా మారింది. వాస్తవానికి అలాంటి సందర్భాన్ని కొత్త రాష్ట్రాలు మనలాంటి ఆంధ్ర వినియోగించుకోవాల్సింది కానీ అలా జరగకపోగా ఆంధ్రలో ఉన్న పెట్టుబడిదారులు మైండ్ సెట్ ని కనుక్కొని తమిళ తంబీలు తీసుకున్న ఈ నిర్ణయం ఒక విధంగా ఆంధ్ర బార్డర్ జిల్లాలకు మంచిదే అయినా మన రాజధాని అంటూ మనకు లేకపోవడం వల్ల మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయం చాలా నీచంగా ఉండటమే ఎందుకు కారణం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ లాగే మెజారిటీతో గెలిచారు కానీ ఆయనకు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు ఒక విజన్ తో ముందు చూపుతో వెళ్తున్నారు. రాజకీయ నాయకుల పైన కక్ష సాధింపు లేదు విలేకరుల పైన కేసులు లేవు ప్రతిపక్ష నాయకులను హింసించడాలు లేవు ఏ సినిమా హీరోనైనా సినిమాల పైన కక్ష సాధింపు చర్యలు లేవు ఇంకో పక్క ఉన్న ఎయిర్ పోర్ట్ సరిపోక ట్రాఫిక్ ఎక్కువ మరో నూతన ఎయిర్ పోర్ట్ చిత్తూరుకి కాంచీపురంకి మధ్య అత్యంత సమీపంలో నిర్మిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కనుచూపుమేరలో ఆంధ్రకు రాజధాని రాదని డిసైడ్ అయిపోయారు. పక్క రాష్ట్రాల వాళ్ళు మన తమిళనాడు మరియు కన్నడికులు ఎవరైనా ఇరుగుపొరుగు రాష్ట్రాల వారి నుండి ఏదైనా ద్రవ్యపరంగా వస్తుపరంగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే రాజధానిని అరువు చేసినట్లు ఉంది. సిగ్గుపడాలి ఇంకొక బెంగళూరు మహానగరాన్ని కన్నడిగులు విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తమిళనాడు వారు తూర్పు నుండి ఆక్రమిస్తే కన్నడిగులు పడమటి ప్రాంతాలైన అనంతపురం తంబళ్లపల్లి మదనపల్లి పుంగనూరు ప్రాంతాల దాకా ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మహానగరాలు విస్తరిస్తున్నాయని సంతోషపడాలో లేదా మన పాలకులు చేతగాని నిర్వాకానికి బాధపడాలో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ఉమ్మడిగా మంచి నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ను కాపాడుకపోతే యువత భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఉండి అనాధగా మిగిలి పోవడం ఖాయం కనపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి ప్యాలెస్ దాకా ఇవన్నీ వినిపిస్తున్నాయో కనిపిస్తున్నాయో తెలియదు రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నావో ఇలాగే మీ ధోరణి మీ ప్రవర్తన ఉంటే భవిష్యత్తు తరాలు క్షమించవు చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి అవడం ఖాయం అని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి దారం అనిత అన్నారు.