రాష్ట్ర ప్రజలని దోచుకోవడానికే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చింది: గాదె

గుంటురు, ముద్దులు పెట్టుకుంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నారని… తాజాగా జగనన్న కరెంట్ షాక్ రత్నంతో ప్రజల నెత్తిన భారీగా చార్జీలు పెంచి బాదుడని జిల్లా అధ్యక్షుడు గాదె విమర్శించారు. జగనన్న బాదుడు పై జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇసుక బాదుడు, మద్యం బాదుడు, చెత్త పన్ను బాదుడు, ఆస్తి పన్ను, పాత ఇళ్లపై కొత్తగా ఓటీఎస్‌ బాదుడు! రైతులపై నీటి పన్ను బాదుడు, నిత్యావసర వస్తువులపై బాదుడు, ఇప్పడు కరెంటు ఛార్జీలపై బాదుతూ… ముఖ్యమంత్రి జగన్ ప్రజలని దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన కరెంటు చార్జీలలో పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం పడిందని… పేదవాడిని బీకొట్టి..డిస్కంలకు లాభం చేకూరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలే రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రావడం లేదని. పెంచిన కరెంట్ చార్జీలతో ఉన్న పరిశ్రమలు మూత పడేలా ఉన్నాయి. దీనితో పనిచేసుకునే వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ రోజు పేపర్లలో యాడ్స్ కోసం కొట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారని.. సలహాదారు లకి లక్షల్లో జీతాలిస్తూ…. తుగ్లక్ పాలనతో అధోగతి పట్టించారని.. చివరకు రాజధాని రాష్ట్రంగా నిలిపారని ఎద్దేవాచేశారు. పెంచిన కరెంట్ చార్జీల తోబాటు.. ఇతర ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై జనసేన పార్టీ జిల్లాలో కార్యాచరణ ప్రారంభిస్తామని..ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా అధికార ప్రతినిధిలు తవిటి భవాన్నారాయణ ఆళ్ల హరి.. నారదాసు ప్రసాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.