పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి.. గర్భానను ఆదేశించిన నాదెండ్ల

  • నాదెండ్ల మనోహర్ ను కలిసిన పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

పాలకొండ: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సదర్భంగా నాదెండ్ల మనోహర్ సత్తిబాబుతో మాట్లాడుతూ.. పార్టీ గెలుపు దిశగా కసరత్తు చేయాలని, అందుకు పాలకొండ నియోజకవర్గంలో పార్టీని సంసిద్ధం చెయ్యమని ఆయన ఆదేశించారు. గర్భాన సత్తిబాబు పాలకొండ నియోజకవర్గంలో వున్న ప్రధానమైన సమస్యలు, ఆ ప్రాంత వాసుల యొక్క సమస్యలు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయనతోపాటు పాలకొండ నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.