ప్రజాప్రతినిధులు గిరిజన జాతి అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నారు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జనసేనపార్టీ నాయకులు నిర్వహిస్తున్న గ్రామా పర్యటనలో భాగంగా పాడేరు మండలం కుజ్జేలి పంచాయితీ గడ్డంపుట్టు గ్రామంలో గ్రామయువత పిలుపుమేరకు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందొలి మురళీకృష్ణ, బూత్ కన్వీనర్ సుర్ల సుమన్, సుబ్బరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కిల్లో రాజన్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలి సమాజం మీద యువతే బాధ్యత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులు చట్టాలను, మన ఓట్లతో గెలిచినా గిరిజన నాయకులు పదవులకు డబ్బుకి కక్కుర్తిపడి హక్కులను కాలరాస్తూ గిరిజన జాతికి ద్రోహం చేస్తున్నారని వారి తీరుని దుయ్యబట్టారు, సాటి జాతికి ఇంత అన్యాయం జరుగుతున్న అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నా ప్రజాప్రతినిధులు గిరిజన జాతి అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. యువత ముందుకొచ్చి మన హక్కులను మన చట్టాలను రక్షన చర్యలు పూర్తి బాధ్యత తీసుకొని కాపాడుకోవలన్నారు హక్కుల సాధన కోసం పోరాడే వారికి జనసేన పార్టీ తరపున పవన్కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని, కోల్పోయిన హక్కులు జీవోలు తిరిగి పునరుద్ధరించడం కోసం, ఉన్న జీవోలను కాపాడటం జనసేనతోనే సాధ్యమని చెప్పారు. అందుకే యువత రాజకీయాల్లోకి ముందుకు వచ్చి కళ్యాణ్ కి అండగా నిలిచి జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ సిద్ధాంతలు, కళ్యాణ్ అశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు, పాడేరు గడ్డపై జనసేన జెండాఎగరడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం, హక్కులను కాపాడుకుందాం. మన సంపదను కాపాడుకుందాం, మా హక్కుల జోలికి వస్తె కబార్దార్ వైసీపీ ప్రజాప్రతినిధులారా అంటూ సవాల్ విసిరారు, పోరాడి సాధించిన హక్కులను కొల్లగొడుతే చూస్తూ ఊరుకోం కచ్చితంగా ఉద్యమిస్తాం మార్పు కొరకు జనసేనపార్టీ ప్రభుత్వ స్థాపనకు నిరంతర కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, బూత్ కన్వీనర్ సుర్ల సుమన్, ముదిలి సుబ్బారావు గ్రామ యువత పాల్గొన్నారు.