మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం: వబ్బిన జనార్ధన శ్రీకాంత్

పెందుర్తి నియోజకవర్గం, విశాఖపట్నం. జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్ రెడ్డి ప్రారంభించిన మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మరో తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం అని వాపోయారు, గత 4 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత దయనీయంగా తీసుకెళ్లినందుకా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయనందుకా, మహిళలకు సాధికారిత కల్పించనందుకా, పర్యావరణాన్ని పాడు చేసినందుకా, అందరికీ ఇల్లు అని చెప్పి మోసం చేసినందుకా, బడుగు బలహీన వర్గాలు జీవించడానికి అనుకూలంగా లేని రాష్ట్రాన్ని తయారు చేసినందుకా, పరిశ్రమలు తీసుకొని రాకుండా ఉన్నందుకా, మద్యపానం నిషేధం అని చెప్పి మద్యం అమ్మకాలు ప్రభుత్వాలు చేపట్టి ఆర్థికంగా లాభాలు సంపాదించినందుకు,రాష్ట్రానికి క్యాపిటల్ నియమించినందుకా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు మరలా నీకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని అడుగుతున్నారని దుయిబెట్టరు, తుగ్లక్ పాలన అనేది పుస్తకాల్లో చదువుకున్నామని కానీ అది ఎలా ఉంటుందో ఈ 4 సంవత్సరాల ఆంధ్రరాష్ట్ర పాలన నిదర్శనం అని, ఈ పాలనలో మేము ఉండడం మా కర్మ అని, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు పాముతో కాటు వేయించుకున్నారని, మొదటి విడతలో గడపగడపకు వైఎస్ఆర్సిపి అనే కార్యక్రమంలో మీ యొక్క ప్రజాప్రతినిధులు వెళ్తుంటే ప్రజలు అడిగిన సమాధానాలకు బదులువకుండా మీకు ప్రజలు చెంపదెబ్బ చూపిస్తే దాని నుంచి బుద్ధి తెచ్చుకోకుండా, మరలా మరొక్కసారి రెండో విడత ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేలాగా స్టిక్కర్లు బ్యాగులు తో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టడం ఎంతవరకు రాష్ట్రానికి శ్రేయస్కరమని, ఈరోజు బటన్ నొక్కుతూ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తూ రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చకుండా రైతు బజార్లను, కలెక్టర్ ఆఫీసులను, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ ప్రజలు కు సంక్షేమ పథకాలను ఇవ్వడాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఎంత దారుణం అంటే 2023 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజుల్లోనే అప్పు తీసుకున్న రాష్ట్రంలో మొదటి స్థానం ఉందని, ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓటు రూపంలో వ్యతిరేకిస్తే జగన్ రెడ్డి ఉలికి పలుకు లేకుండా తన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని, ఇంకా ఎవరైనా వైఎస్ఆర్సిపి అభిమానులు ఉంటే ఒక్కసారి ఆలోచించుకోవాలని మరొక్కసారి అవకాశం ఇస్తే ఈసారి మిగిలిన ప్రభుత్వ ఆస్తులతో పాటు మన యొక్క ఆస్తిని కూడా కొత్త చట్టం తీసుకొని వచ్చి అమ్ముకునే అవకాశం ఉందని, ఈ ఆంధ్రరాష్ట్రానికి భవిష్యత్తులో ఏటువంటి కేసులు లేని నాయకుడు, సొంత కష్టార్జితం ను ప్రజలకు పంచే నాయకుడు అవసరమని ఈనాడు ప్రజలందరూ కూడా అటువంటి లక్షణాలున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని, తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని సన్మార్గంలోని నడుపుతామని అప్పటివరకు ఒక సంవత్సరం ఉంది కావున జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా ఎంజాయ్ చేయండి కానీ చెత్త చెత్త కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేయవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నామని మాట్లాడారు.