రా కదిలిరా సభకు తరలి వెళ్ళిన మదనపల్లి జనసేన శ్రేణులు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి నుండి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి శనివారం పీలేరులో జరగబోయే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా.. కదిలిరా.. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి దాదాపు 200 కార్లతో ర్యాలీగా చౌడేశ్వరి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంకు సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, తట్టివారిపల్లి మీదుగా పీలేరుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ విముక్త అంద్రప్రదేశ్, రాజంపేట పార్లమెంట్, వైసీపీ విముక్త మదనపల్లి దిశగా తెలుగుదేశం మిత్రులతో కలసి మెలిసి పనిచేసి రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొనేందుకు కృషి చేస్తామని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అన్ని సదుంలో జరుగుతున్నాయన్నారు.
రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గం ప్రజలు, యువత అందరూ కలసి రాజంపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబ అహంకారానికి ఓట్లతో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.