ప్రమాదకరంగా మారిన బోనకల్ హైవే బ్రిడ్జి రోడ్డు.. పట్టించుకోని అధికారులు

మధిర: ప్రమాదకరంగా మారిన బోనకల్ పై బ్రిడ్జి దుస్థితి పై స్పందించిన జనసేన పార్టీ బోనకల్ విద్యార్థి నాయకులు గంధం ఆనంద్ మాట్లాడుతూ బోనకల్ మండల కేంద్రంలో ఉన్న హైవే బ్రిడ్జిపై రోడ్డు పగిలి, బారుగా గొయ్యి ఏర్పడి ఇనుప రాడ్లు పైకి వచ్చి వాహనాలు దిగబడేలా చాలా ప్రమాదకరంగా మారింది. బోనకల్ లో ఉన్న అధికారులకు ఈ సమస్య ఎవరికీ కనపడటం లేదా?. ప్రమాదకరంగా మారిన ఈ బ్రిడ్జినీ పట్టించుకోవడంలేదు. బోనకల్ గ్రామ ప్రజలు రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా హా బ్రిడ్జి పైన యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఆ బ్రిడ్జి పైన ఎక్కువగా లారీలు తిరగటం వలన, బైక్ లు ఇరుక్కొనే లాగా రోడ్డు అంత ఆగమైంది. 40 టన్నుల లారీలు రావడంతో ఈ బ్రిడ్జి బోనకల్ ప్రధాన రహదారి కాబట్టి ఎక్కువగా ఆంధ్రాకు ఎక్కువగా లారీలు వెళ్తాయి. కాబట్టి రోడ్డు అంత ఆగమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారని అంటే బ్రిడ్జి మీద రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి పైన ప్రమాదకరంగా మారిన గొయ్యి మరమత్తులు చేయించారా?. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయడానికి వేల కోట్లు ఖర్చు పెడతారు. కానీ బ్రిడ్జి ప్రమాదకరంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారంటే పట్టించుకోరా.. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితం కట్టించిన బోనకల్ బ్రిడ్జి పై కనీసం లైట్లు కూడా లేవు.. ఇకనైనా స్థానిక బిఆర్ఎస్ నాయకులు మరియు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క గారు చొరవ తీసుకొని బోనకల్ బ్రిడ్జి పై మరమత్తులు చేపట్టాలని, బ్రిడ్జి మీద లైట్లు ఏర్పాటు చేయాలని గంధం ఆనంద్ డిమాండ్ చేసారు.