చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు

*జనసేనాని పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు మలిదశ సభ్యత్వ నమోదు ప్రక్రియ
*పూర్తిస్థాయిలో పార్టీ బలోపేత దిశగా చంద్రగిరి నియోజకవర్గంలో అడుగులు వేస్తున్న నాయకులు, మండల అధ్యక్షులు
*జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశానుసారం విస్తృతస్థాయిలో సభ్యత్వ నమొదు ప్రక్రియ
*నియోజకవర్గంలో సాంకేతికంగా సహాయం కోసం ఇద్దరు వాలుంటీర్లను మరియు దాదాపు 24 మందికి నమోదు చేయగలిగే సామర్థ్య వెసులుబాటు కల్పించి వారిచే అన్ని మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది

చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతదిశగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న దేవర మనోహర్, ఇదే తరుణంలో జనసేనపార్టీ అధ్యక్షులు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా విస్తృతస్థాయిలో కొనసాగుతుంది.

7 మండలాలు కలిగి ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీని బూత్ స్థాయిలో బలోపేతదిశగా తీసుకెళ్లేలా చర్యలు చెప్పట్టిన నాయకులు మండలంలోని ఓటర్లు సంఖ్యనుబట్టి మండలానికి 2 నుండి నలుగురు జనసేన వాలోంటీర్లని నియమించి వారిచే నమోదు కార్యక్రమం మరియు ఎటువంటి సాంకేతిక సమస్యలు వచ్చిన పరిష్కరించే దిశగా ఇద్దరు టెక్నికల్ కోఆర్డినేటర్లను నియమించారు.

క్రియాశీలక సభ్యులే పార్టీకి వెన్నుముకగా భావించి అర్హులైన ప్రతి ఒక జనసైనికుడు, అభిమాని, కార్యకర్త సభ్యత్వాన్ని నమోదు చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చెయ్యాలని కోరారు.

ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల రాబోవు రోజుల్లో రానున్న ఏ ఒక్క కమిటీ లేక పదవుల్లో మొదటి ప్రాధాన్యత మరియు జరగరానిదిదేదైనా జరిగితే ₹50000 వరకూ ప్రమాద భీమా ₹5,00,000 వరకు పొందవచ్చని సూచించారు.

కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని పార్టీలో మరియు పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామ్యులు అవుతారని జిల్లా యంత్రాంగం ఆకాంక్షిస్తూ 10 రోజుల నమోదు ప్రక్రియ గడువును వినియోగించుకోవాలని, ఎదైన సమస్యలు ఉన్నచో వారివారి మండల అధ్యక్షులను సంప్రదించగలరని చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర్ తెలిపారు.