స్కూల్ ఫీజులు వసూలు చేయడం కోసమే స్కూలు తెరిచారు

దేశమంతా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటే మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో మాత్రమే మీ పథకాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని కిరణ్ రాయల్ అన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేసి ఆన్లైన్ క్లాసులు నడపకుండా, టార్గెట్లు పెట్టి మరీ స్కూల్ ఫీజులు వసూలు చేస్తారా ఇందులో జగన్ రెడ్డి వాటా ఎంత? మీ పథకాలకు డబ్బులు కోసం ఫీజులు వసూలు చేసుకుని, తరువాత లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా? దేశమంతా స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు మరియు లాక్ డౌన్ నడుస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మీ సొంత ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో అడుకోవడమే కాకుండా టార్గెట్లు పెట్టి మరీ ఫీజులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ఫీజులు కట్టుటకు గాను నాలుగు, ఐదు నెలలు గడువు ఇవ్వవలసినదిగా తిరుపతి జనసేన పార్టీ తరపిపున డిమాండ్ చేస్తున్నాం అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు.