కులం అని పిలవబడే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది: రామ్

ఇటీవల హీరో రామ్ రమేష్ హాస్పిటల్, స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుసు అనేలా చేసిన ఆయన ట్వీట్స్ సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఇకపై వివాదాల జోలికి పోనని మరో ట్వీట్‌లో రామ్ తెలిపాడు. అయితే రమేష్ హాస్పిటల్ ఛైర్మన్, తన అంకుల్ డాక్టర్ రమేష్ బాబును ఆయన వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడని కొందరు రామ్‌పై కుల ముద్ర వేస్తూ ట్వీట్స్ చేయడంతో పాటు, లైవ్ డిబైట్స్‌లో కూడా ఆరోపించడంతో.. తాజాగా రామ్ ‘కులం’ గురించి ప్రస్తావిస్తూ.. మరో ట్వీట్ చేశారు.

‘‘నా ప్రియమైన బ్రదర్స్ మరియు సిస్టర్స్‌కు.. కులం అని పిలవబడే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది మరియు త్వరగా అంటుకుంటుంది. ఇది కరోనా కంటే ప్రమాదకరమైనది. దీనిని నిశ్శబ్దంగా వ్యాపింపజేసేవాళ్లు.. మిమ్మల్ని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తారు. దయచేసి దూరంగా ఉండండి. గొప్పదైన పని కోసం అందరూ కలిసి ఉండండి. ప్రేమతో రామ్ పోతినేని..’’ అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.