రాష్ట్రానికి జగన్ అవసరం ఏమాత్రం లేదు

  • వైసీపీ దూరాగతాలకు, పాలనా వైఫల్యాలకు గ్రంధాలయం కూడా సరిపోదు
  • వైసీపీ పాలనలో రాష్ట్రం ముప్పైఏళ్లు వెనక్కి వెళ్ళింది
  • మరో ఛాన్స్ అడిగే అర్హత ఎప్పుడో కోల్పోయిన జగన్ రెడ్డి
  • వైసీపీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలంటూ మహాత్మాగాంధీ విగ్రహాన్ని వేడుకున్న జనసేన నేతలు
  • నో ఏపీ నీడ్స్ జగన్ – ఏపీ వాంట్స్ పవన్ పోస్టర్లు విడుదల చేసిన నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఎంతో నమ్మకంతో రికార్డ్ స్థాయిలో మెజారిటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన అసమర్ధ, అవినీతి, దాష్టీక, దోపిడీ పాలనతో వంచించి, రాష్ట్రాన్ని అంధకారాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సేవలు రాష్ట్రానికి ఇక అవసరం లేదని నగర జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నో ఏపీ నీడ్స్ జగన్ – ఏపీ వాంట్స్ పవన్ అంటూ పోస్టర్లను విడుదల చేసారు. జగనూ… నీ పాలనంతా నూసెన్స్ – నీకు లేదు మరో చాన్స్ జగనూ నువ్వొద్దు – నీ పాలన అంతకన్నా వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు రావాలో? జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరమో? చెప్పే దమ్మూ ధైర్యం వైసీపీ నేతల దగ్గర లేదని విమర్శించారు. గతంలో చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నకు చెబుదాం అంటూ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురైన సంగతి అందరికీ తెలిసిందేనని దుయ్యబట్టారు.రాష్ట్రాన్ని ఊహించని స్థాయిలో అప్పులఊబిలోకి దించిన జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని జోస్యం చెప్పారు. పోలవరం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రైతులకు అండ లేదు, మద్యనిషేధం అంతకన్నా లేదు, ఉద్యోగులకు జీతాలు లేవు, అడబిడ్డలకు రక్షణ లేదు, సరైన విద్యా, వైద్య సదుపాయాలు లేవు ఇలా ప్రజాకంటక పాలన సాగిస్తున్న వైసీపీకి మరో చాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిద్దని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పని అయిపోయిందని, రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరిలో మ్యానిఫెస్టో విడుదల చేస్తామని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, సమస్త సంపదని దోచుకున్న జగన్ రెడ్డి అండ్ కోకి దోచుకోవటానికి ఇంకేమి మిగిలిందని విమర్శించారు. తనని నమ్మిన అన్ని వర్గాల ప్రజల్ని వంచించిన జగన్ రెడ్డి సరికొత్త నయవంచక మాటలతో తడి గుడ్డతో గొంతులు కోసే ఎత్తులతో మళ్ళీ అధికారంలోకి రావటానికి చేస్తున్న కుట్రలను రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ప్రతీఒక్కరూ సంఘటితంగా ఎదురుకోవలన్నారు. గుండె లోతుల్లోంచి కాకుండా పెదాల మీద నుంచి మాత్రమే నా యస్సిలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడతాడని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో దళితులు, మైనారిటీలు మీద జరిగిన దాడులు రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. వైసీపీ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, 2024 ఎన్నికల్లో వైసీపీ బిచాణ ఎత్తేయటం ఖాయమని ఆళ్ళ హరి అన్నారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ రాష్ట్రానికి వైసీపీ నుంచి విముక్తి కల్పించాలంటూ కోరుకున్నారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు, కటకంశెట్టి విజయలక్ష్మి, సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర కుమార్, తోట కార్తీక్, సుంకే శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొత్తకోట ప్రసాద్, పులిగడ్డ గోపి, మహమ్మద్ భాష, కుర్ర శీను నాయక్, నాగేంద్ర సింగ్, మరియు ఆషా, సాంబ్రాజ్యం, డివిజన్ అధ్యక్షులు, గడ్డం రోశయ్య, యాట్ల దుర్గాప్రసాద్, షర్ఫుద్దీన్, ఏడుకొండలు, అంబటి శివకుమార్, తోటకూర విజయ్, గాజులు రమేష్, మరియు జనసైనికులు, వీరమహిళలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.