బలిజల ఐక్యత అన్ని కులాలతో కలుపుకు పోవాలి

కాపు సంక్షేమ సేన రాష్ట్ర నాయకులతో సుధా మాధవ్

నెల్లూరు: రాష్ట్రంలో పరిస్థితులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగుండి హరి రామ జోగయ్య పిలుపుమేరకు పాలకొల్లులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని. నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు బెల్లపు సుధా మాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు సంక్షేమ సేన సిద్ధాంతాలను వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య గారి నాయకత్వంలో జిల్లాలో కాపు సంక్షేమ శాఖ ముందుకు తీసుకు వెళదామని ఈ సందర్భంగా మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీకి మద్దతుగా ముందుకు వెళుతున్న కాపు సంక్షేమ శాఖకు అన్ని మతాలవారు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే జనసేన రాజ్యాధికారం సాధించినప్పుడే బడుగుల అభివృద్ధి సాధ్యమన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి కాపు సంక్షేమ సేనను బలోపేతం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు హరినామ జోగయ్యకు సుధామాధవ్ హామీ ఇచ్చారు.